వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు


నెల్లూరు: 
వైసీపీ  కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. నెల్లూరు మెప్మా  పీడీ రవీంద్రని శలవు పెట్టి వెళ్లాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి ), ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి  నేరుగా రంగంలోకి దిగారు. నిబంధనలకి వ్యతిరేకంగా గ్రూపులకి రుణాలు మంజూరు చేయాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. మెప్మా పొదుపు రుణాల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ఒక్కో గ్రూపుకి నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్  అమలులో ఉన్నప్పటికీ రుణాలు మంజూరవుతున్నాయి. పీడీ రవీంద్రని మార్చాలంటూ పశుసంవర్ధక‌ శాఖ అధికారి, మెప్మా సీఓ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.