మహిళలను ఎప్పుడూ చిన్న చూపే చూస్తున్న తెలుగుదేశం నాయకులు


 జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్

మహిళలు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి పరిపాలనలో సముచిత స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పదవులలో 50 శాతం పైనే రిజర్వేషన్ కల్పించడం ద్వారా మా మహిళలు వివిధ పదవులు అలంకరించేలా చేశారు.
దానిలో భాగంగానే కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామ సర్పంచ్ గా దూనబోయిన నవదీప గారు సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
ఖండ్రిగ గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ ఇటీవల ఖండ్రిగ గ్రామంలో 24 వ తేదీన జరిగిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఎస్సి సామాజిక వర్గ నాయకుల చేరికల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సర్పంచ్ నవదీప గారిని ఆమె భర్త శ్రీనివాస్ తీసుకెళ్లడం తప్పా? అలా తీసుకెళ్లి పక్కన నుంచున్న ఆయనను తెలుగుదేశం నాయకులు ఫోటోలు, వీడియోలు తీసి ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేయడం వలన ఆ కుటుంబం ఉపాధి కోల్పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో గోపాలపురం గ్రామానికి చెందిన APSRTC ఉద్యోగి పాల్గొన్న దాఖలాలు లేవా, బిళ్ళకుర్రు, రావులపాలెం గ్రామాలలో రేషన్ డీలర్లు మీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొవడం లేదా?

శ్రీనివాస్ వైసీపీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినా EC ని అడ్డం పెట్టుకుని ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడం హేయమైన చర్య.

మా నాయకుడు ఎవరి పొట్ట కొట్టకూడదనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లడం వలన మేము ఎప్పుడు మీ పార్టీ అనునాయులను ఇబ్బందులకు గురిచెయ్యలేదు.
గతంలో ఇలానే ఎన్నికల సమయంలో ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో ఎస్సి సామాజిక వర్గానికి చెందిన నల్లి రాజు గారిని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునుండి సస్పెండ్ చేయించిన ఘనులు మీరే.
ఇలా ఎప్పటికప్పుడు ఎస్సి, బీసీ సామాజిక వర్గాల మీద కక్ష సాధింపు చర్యలు టీడీపీ వారు మానుకోవాలి అని ఆమె అన్నారు.

వై.యస్.ఆర్.సి.పి.మహిళా ప్రజా ప్రతినిధులు ఏఎంసి చైర్మన్ రెడ్డి రవిదేవి, మోడేకుర్రు సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు పితాని రామలక్ష్మి తులసి, బొక్కా నాగరాణి తదితరులు పాల్గొన్నారు.