అసహనం వ్యక్తం చేసిన ఎమ్మేల్యే .. ఎస్పీ రితిరాజ్ కి ఫోన్
జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలో వరుస దొంగతనాలపై ఎమ్మేల్యే బండ్ల క్రిష్ణ మొహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఎమ్మేల్యే...తాజాగా నిన్న గద్వాల పట్టణంలోని లింగం బాగ్ కాలనీలోని ఇనుగూరి వెంకటేశ్వర్లు శెట్టి ఇంట్లో 10లక్షల నగదు 50తులాల బంగారం చోరికి గురైన తెలుసుకున్న ఎమ్మేల్యే బండ్ల క్రిష్ణ మొహన్ రెడ్డి బాధితులను వారి ఇంటి దగ్గరకు వెళ్లి దైర్యం చెప్పారు..
జిల్లా ఎస్పీ రితిరాజ్ తో మాట్లాడి గద్వాల పట్టణంలో వరుస దొంగ తనాలను అరికట్టాలని ప్రజలకు పోలీసులు దైర్యం కల్పించాలని కోరారు సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ త్వరలోనే దొంగలను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు,..