జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యుల్ ప్రకారం, మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి. గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు.