వైసీపీ ఎంపీ భరత్ కు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి: ఆదిరెడ్డి వాసు


 వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ లతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేశ్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నరేశ్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని.. దీనిపై జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.  


ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగారు.