ట్యాంక్ బండ్ కాదు ఇది గుదిబండ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయని అందులో మినీ ట్యాంక్ బండ్ కూడా ఒకటి అని, 50 కోట్ల రూపాయల తో ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టినా ఏమాత్రం పనులు పూర్తి కాలేదు అని, ఇష్టానుసారంగా చెరువును ఇటు ట్యాంక్ కాకుండా అటు బండ్ కాకుండా చేశారని ఆయన ఆరోపించారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు ట్యాంక్ బండ్ పర్యవేక్షణ కూడా చేయడం జరిగింది అని , ఎలాంటి ప్లానింగ్ లేకుండా ప్రజాధనాన్ని నీటి పాలు చేశారని ఆయన చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ఈ ట్యాంక్ బండ్ కు నిధులు ఎక్కడ న
ట్యాంక్ బండ్ కాదు గుదిబండ: ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు
March 28, 2024