స్పందనకి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదు 75 .....విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ .

స్పందనకి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదు 75 .....
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్ .

* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమానికి  75  ఫిర్యాదులు .

* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ.
 
వి 3 టివి న్యూస్ :- 

కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్   సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం మొత్తం  75  ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ......

 హైదరాబాద్ లో తక్కువ రేటు కే బంగారం ఇప్పిస్తామని  డబ్బులు తీసుకొని మోసం చేసిన అశోక్  అనే వ్యక్తి పై చర్యలు తీసుకొని  మా డబ్బులు తిరిగి ఇప్పించాలని మంత్రాలయం మండలంకు చెందిన లక్ష్మీ  ఫిర్యాదు చేశారు. 
నన్ను నమ్మించి చీటిల పేరుతో నా దగ్గర రూ. 7 లక్షల పై గా డబ్బులు వసూలు చేసి ఆ మొత్తం డబ్బులు ఇవ్వకుండా పరా రైన  చిత్రాల సాయిబాబ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామానికి చెందిన అశోక్   ఫిర్యాదు చేశారు.
 పోస్టల్ డిపార్డ్ మెంట్ లో పని చేస్తూ నేను ఇంటి కోనుగోలు కోసం దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హౌసింగ్ పేరుతో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి రూ. 35 లక్షలు తీసుకొని మోసం చేసి ఇల్లు ఇవ్వకుండా 3 సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురి చేస్తూ , బిల్టర్స్ నాగేంద్రుడు, సోమయ్య ఆచారి మోసం చేశారని  కోడుమూరు కు చెందిన అరుణ ఫిర్యాదు చేశారు.
 నా భార్యకు  గవర్నమెంట్  ఉద్యోగం ఇప్పిస్తామని  రూ. 15 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని  కర్నూలు , సీతారాం నగర్ కు చెందిన మురళీ కృష్ణ ఫిర్యాదు చేశారు.
నాకు డీగ్రీ చదివిన కుమారులు ఉన్నారు.   కర్నూలు స్టేట్ బ్యాంకు లో డెేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని ప్యాపిలి కి చెందిన దీప్, మనోజ్ లు రూ. 3 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , సిక్యాంపు కు చెందిన అచ్చన్న ఫిర్యాదు చేశారు.
 వారసత్వంగా మా తండ్రి గారి ద్వారా వచ్చిన నూతన పల్లె గ్రామ శివారులోని  రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్న గొల్ల జయమ్మ మా పొలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సూదిరెడ్డి పల్లెకు చెందిన అక్కచెల్లెలు  సరస్వతమ్మ, సరోజ, చిట్టెమ్మ లు  ఫిర్యాదు చేశారు. 
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్  హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో  డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ,  లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు  , సిఐ శివశంకర్  పాల్గొన్నారు.