ఇంట్లో చోరీ చేసి నెలరోజుల్లో తిరిగిస్తాంటు లెటర్ పెట్టిన "మంచి దొంగ"..

👉 ఇంట్లో చోరీ చేసి నెలరోజుల్లో తిరిగిస్తాంటు లెటర్ పెట్టిన "మంచి దొంగ"..
👉 దొంగతనం చేసిన డబ్బులు మళ్ళీ ఇస్తాను అని చెప్పిన మంచి దొంగ లెటర్ చూసి బాధితులు నవ్వ్వలా, ఎడవలా తెలియక తల పట్టుకుంటున్నారు.
👉 తమిళనాడు తూత్తక్కుడి జిల్లా లోని తీరుచ్చేందర్ వద్ద మేఘ్నపురం నికి చెందిన చిత్తిరి సెల్విన్ ఉపాధ్యాయుడుగా రీటైడ్ అయినారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు అందరికీ వివాహాలు అయి వేరే ప్రాంతం లో నివాసాలు ఉన్నారు.
👉 జూన్ 17న సెల్విన తన భార్య తో కలిసి చెన్నై కు వెళుతూ ఇంటినీ అక్కనే ఉన్న సెల్వి అనే మహిళ కు అప్పజెప్పారు.
👉 ఈనెల 1వ తేదీన సెల్వీ ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్లేగా సెల్విన ఇల్లు తాళం పగలు గొట్టి తలుపు తెరిచి ఉండంతో వెంటనే ఇంటి యజమాని కి సమాచారం అందించారు. దీనితో సెల్విన ఆగమేఘాల పై వచ్చి యింటిలో పరిశీలించగా బీరవ లోని 60వేల రూపాయలు నగదు 11/2 సవర్లు బంగారు కమ్మలు, వెండి వస్తువులు చోరీ అయినట్ల గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచరమిచ్చారు.
👉 ఘటన స్థలం కు చేరుకొన్న పోలీసులు ఆ ప్రాంతం అంతా పరిశీలించగా అక్కడ ఒక లెటర్ కనబడింది. అందులో "నన్ను క్షమించండి.. నేను నెల లోపల మీ డబ్బులు, నగలు తిరిగి మీకు ఇచ్చేస్తాను మా ఇంట్లో వారి ఆరోగ్యం బాగాలేదు అందుకే ఈ దొంగతనం చేసినట్టు రాసి ఉంది.
👉 ఈ లెటర్ చూసి బాధితులు ఆ దొంగ "మంచి దొంగ"లేక ఘరానా దొంగ అని నవ్వ్వలో, ఏడవాలో అర్థంకాలేదు.