పంపింగ్ హౌస్ నుండి సర్ఫర్ అయ్యే త్రాగునీరు ట్యాంకులను శుద్ధి చేయాలి,

పంపింగ్ హౌస్ నుండి సర్ఫర్ అయ్యే త్రాగునీరు ట్యాంకులను శుద్ధి చేయాలి,

వి 3టీవీ న్యూస్:- 
హాలహర్వి మండలం లోనీ బాపురం చింతకుంట పంప్ హౌస్ నుంచి సుమారు 45 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది ఆయా గ్రామాలకు వదిలే నీటిని శుద్ధి చేయాలని హాలహర్వి జనసేన మండల అధ్యక్షుడు చంద్ర జనసేన కార్యకర్తలు డిమాండ్,చేస్తూ హాలహర్వి ఎంపీడీవో కార్యాలయంలో యు ఆర్ డి మల్లికార్జున చేతులకు వినతి పత్రం అందించారు, ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు చంద్ర మాట్లాడుతూ హాలహర్వి మండలంలో బాపురం చింతకుంట గ్రామాల పంప్ హౌస్ నుండి త్రాగునీరు శుద్ధి చేయక పోవడంతో నీరు కలుషితం మారుతున్నాయని ఆ నీటిని గ్రామాల్లో ప్రజలు ఆ కలుషిత నీళ్లు తాగడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు కావున వెంటనే అధికారులు స్పందించి నీటిని శుద్ధి చేసి గ్రామాలకు వదలాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చంద్ర, మల్లి, శీను. తిమ్మప్ప బసవరాజు, పవన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు