V3టీవీ నూస్ కర్నూలు టౌన్:
నగరంలోని కిసాన్ ఘాట్ వద్దనున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్వీమ్మింగ్ పూల్ నందు శనివారం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, సెట్కూరు సీఈఓ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిత్యం ఈతను సాధన చేస్తే ఆరోగ్యంగా ఉంటారని, చిన్నారులు ఈతను నిత్యం సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతాకాలు తీసుకొని రావాలని కోరారు. సెట్కూరు సీఈఓ మాట్లాడుతూ 5 దశాబ్దాల క్రితం దక్షిణాంధ్రలో 50/21 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన తొలి స్విమ్మింగ్ పూల్ కర్నూలులో ఏర్పాటు అయిందని తెలిపారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన స్విమ్మింగ్ పూల్ గత ఏడాదిలో సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడున్నామని తెలుసుకుని, కమిషనర్ దాదాపు రూ.25 లక్షలతో అన్ని రకాల సదుపాయాలను త్వరితగతిన చేపట్టి పూర్తి చేశారని కొనియాడారు. అలాగే కమిషనర్ ఈతకులు కావడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం స్విమ్మింగ్ పూల్ లైఫ్ టైం మెంబర్స్ కమిషనర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, స్విమ్మింగ్ శిక్షకులకు నటరాజారావు తదితరులు పాల్గొన్నారు.