అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూలకల్లు మోడల్ హై స్కూల్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూలకల్లు మోడల్ హై స్కూల్

ఆఫ్ లైన్ అడ్మిషన్లు అటెండెన్స్ హాజరు శాతం తక్కువ ఉన్న వారి నుంచి టీసీలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఆధారాలు

జూలకల్లు హైస్కూల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ టీచర్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఎడి శామ్యూల్

కర్నూలు జులై 07: గూడూరు మండలం జూలకల్లు గ్రామంలో ఉన్నటువంటి మోడల్ హై స్కూల్ లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ హకీం దిల్షాద్ పై అక్కడ పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ టీచర్ ఏడి సామ్యూల్ కు అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపై తనపై కక్షపూరితంగా ప్రవర్తిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు ఫిర్యాదుకు సంబంధించి మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హర్షద్ అనే ఒకేషనల్ ట్రైనర్ ను తన వ్యక్తిగత సహాయకునిగా తన సొంత పనులకు ఉపయోగించుకుంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను అక్కడి నుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిజానికి కంప్యూటర్ టీచర్ మరియు ఒకేషనల్ ట్రైనర్ ఉన్న స్కూళ్లలో ఒకేషనల్ ట్రైనర్లు ట్రాన్స్ఫర్లు పెట్టుకుని కంప్యూటర్ టీచర్లు లేని ప్రాంతాలలో పనిచేయాలని వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన వ్యక్తిగత సహాయకునికి అక్కడే పని చేసుకునే విధంగా తనకి మద్దతుగా ఉంచుకోవాలని ఉద్దేశంతో గత మూడు నెలల నుండి మాకు అవసరం లేదు నువ్వు వెళ్లిపోవచ్చు అంటూ వేతన బిల్లులు కూడా పెట్టడం లేదని తాను 2018 నుండి అదే స్కూల్లో పనిచేస్తున్నానని ప్రిన్సిపల్ హకీం దిల్సేద్ 2020లో అక్కడ బాధ్యతలు చేపట్టారని తన విధులకు సంబంధించి పిల్లలకు రెగ్యులర్గా తరగతులు తీసుకుంటున్నానని అవేకాక మిగతా పాఠశాల సంబంధిత ఆఫీస్ వర్క్ కూడా చేస్తూ ఉన్నానని గత సంవత్సరము తనపై జిల్లా విద్యాశాఖ అధికారి నుండి తాను కంప్యూటర్ టీచర్ తరగతులకే కాకుండా మిగతా ఆఫీస్ వరకు కూడా చేయించుకునే విధంగా ఆర్డర్స్ తెచ్చుకున్నారని దానికి కూడా నేను ఒప్పుకుని పని చేస్తున్నానని కానీ హర్షదనే ఒకేషనల్ ట్రైనర్ కోసం తనను అక్కడి నుండి తప్పించాలని చూస్తున్నారని పాఠశాలలో మిగిలిపోయిన సీట్లకు సంబంధించి ఆఫ్లైన్లు అడ్మిషన్లు చేసుకునే ముందు పిల్లలనుండి డబ్బులు వసూలు చేస్తుందని అలాగే హాజరు శాతం సంబంధించి తక్కువగా ఉందని చాలామంది పిల్లల దగ్గర 500 నుండి 2500 వరకు వసూలు చేసిందని కొంతమంది తల్లిదండ్రులు ప్రశ్నించగా వారికి తిరిగి ఇచ్చేసిందని అలాగే టిసి ఇచ్చేముందు కూడా డబ్బులు వసూలు చేయడం మిగతా మిగతా వాటిలో హర్షద్ అనే వ్యక్తి తనకు అండదండగా ఉన్నాడని దీనికోసమే అతనిని స్కూల్లో ఉంచుకొని నన్ను పంపించివేయాలని చూస్తుందని దీనిపై తనకు న్యాయం చేయాలని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలను తెలియపరుస్తానని ఏడి సామ్యూల్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు ఈ విషయమై సంబంధిత విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రశ్నించవచ్చని ఈ విషయాలు బయటపెట్టినందుకు తనపై కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఆరోపణ చేస్తూ పై అధికారులకు ఫిర్యాదులు చేసి తప్పించే రత్నాలు జరుగుతున్నాయని దీనిపై సమగ్ర విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు


ఏడి సామ్యూల్ వివరణ
తనకు వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నాలుగు తారీకు గురువారము తాను పాఠశాలను సందర్శించనని అక్కడ కొద్ది వరకు వివరాలు సేకరించానని విచారణంగా పూర్తిస్థాయిలో అవలేదని వీలైతే మరొక రోజు పూర్తిగా విచారణ చేసి వివరాలు వెల్లడిస్తానని తెలియజేశారు