వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే విరుపాక్షి ......

వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే విరుపాక్షి ......


వి3టీవీ న్యూస్ :

 హాలహర్వి :- వరద ఉద్రేకంతో కొట్టుకుపోయిన ఎన్ హెచ్ 167,రోడ్డును పరిశీలిస్తున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి అతి భారీ వర్షం కురవడంతో కర్ణాటక ఆంధ్ర పలు ప్రాంతాల నుండి వర్షపు నీరు భారీ ఉద్రేకంతో ప్రవహించడంతో నేషనల్ హైవే 167 రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని ఎన్ హెచ్ హైవే రోడ్డు నిర్మాణానికి వంతెన ఏర్పాటు పనులు చేపట్టిన సమయంలో రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని , చింతకుంట గ్రామ ప్రజలతో సమాచారాలు తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఎన్ హెచ్ హైవే అధికారులు రోడ్డు నిర్మాణ సమాచారం ఇవ్వాలని రోడ్డు నిర్మాణానికి నిర్లక్ష్యం చేయకుండా ఎన్ హెచ్ హైవే అధికారులను హెచ్చరించారు, అలాగే చింతకుంట గ్రామ ప్రజలు వరద నీటిలో పొలాలు నీటి మునిగాయని వరదనీరు ఉద్రేకంతో వంకలు వాగులు భారీగా ప్రవహించడంతో అటు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో చింతకుంట సమీపంలో వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని పక్క గ్రామానికి పొలాలకు వెళ్లాలంటే త్వరగా తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని చింతకుంట గ్రామ పెద్దలు పరశురాం, గంగాధర్ ,రామప్ప, గ్రామస్తులు కోరారు ,