ఏపీలో 22 నగరాల్లో కొత్త FM స్టేషన్లు*


    *ఏపీలో 22 నగరాల్లో కొత్త FM స్టేషన్లు*

దేశంలోని 234 నగరాలు/పట్టణాల్లో ప్రైవేట్ FM రేడియోను కేంద్రం అందుబాటు లోకి తీసుకు రానుంది.₹784.87 కోట్ల రిజర్వ్ ప్రైస్ తో 
730 ఛానళ్లకు ఈ-ఆక్షన్ నిర్వహించనుంది. ఏపీలో ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నంద్యాల, నర్సరావుపేట, ఒంగోలు , ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరంలో కొత్త స్టేషన్లు రానున్నాయి.