*పారా మిలటరీ బలగాలు అవగాహన తరగతులు నిర్వహించిన మాజీ పారా మిలిటరీ జవాన్లు*
తే.12/8/24 ది విజయనగరం జిల్లాలో సెంట్రల్ ఎక్స్ పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు *మహా రాజా కాలేజ్ విజయనగరం విద్యార్థులకు పారా మిలిటరీ బలగాలు అవగాహన క్లాస్ నిర్వహించారు* భారత్ దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ దేశ నలువైపులా ఇంటర్ నేషనల్ బోర్డర్ లో శక్తి స్తంభాలుగా నిలబడి రాత్రింభవళ్లు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న సైనికులు ఎవరు , ఏ వర్గానికి చెందిన వారు,వారు ఎక్కడ ఎలా డ్యూటీ చేస్తూ ఉన్నారు అనే అనేక సత్యాలను పారా మిలిటరీ అసోసియేషన్ సైనికులు .నేటి విద్యార్థులకు అవగాహన క్లాస్ ద్వారా తెలియచేసి క్లుప్తంగా వివరించారు.
*First line of defence Border security Force* ప్రపంచంలోనే శక్తి వంతమైన పారా మిలిటరీ దళం BSF . ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్, బోర్డర్ లో క్లాక్ వైజ్ 365 రోజులు సెలవు దినాలు లేక నిరంతరం శ్రమిస్తూ తీవ్రమైన ఎండ 49 డిగ్రీ హీట్ రాజస్థాన్ ఏడార్లలో, మైనస్ జీరో శీతలత జమ్మూ కాశ్మీర్ లో, తీవ్ర వర్షపాతం మేఘాలయ, మిజోరాం అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఇవ్వన్నీ తట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని, మలేరియా, డెంగు,మైండ్ మలేరియా కు ఎంతో మంది జవాన్లు బలైపోతు ఉంటారు.అలాగే ITBP (Indian Tibet Border Police) చైనా బోర్డర్ లో మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు,SSB (సశస్త్ర సీమా భల్) నేపాల్ బోర్డర్ లో సేవలు చేస్తూ ఉన్నారు,CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) మన దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీ చుట్టూ సెక్యూరిటీ సర్వీస్ చేస్తూ ఉన్నారు, మన దేశ పార్లమెంట్ భవనం చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది CISF మరియు అన్ని విమానాశ్రయాల్లో కూడా సెక్యూరిటీ సేవలు చేస్తున్నారు.CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) దేశం లోపల ఎటువంటి అలజడి అల్లకల్లోలం సంభవించినప్పుడు లా & ఆర్డర్ ను మెయింటైన్ చేస్తూ శాంతిని స్థాపించడానికి మరియు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో వారి గతి విధులను నిర్మూలించడానికి రాత్రింబవళ్ళు కూంబింగ్ సేవలు చేస్తూ ప్రాణ త్యాగాలు చేసి ఉన్నారు, NDRF (నేషనల్ డిసస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, భూకంపాలు, తుఫాన్లు, ట్రైన్ ఆక్సిడెంట్లు,రాజకీయ ప్రభాంజనాలు సంభవించినప్పుడు NDRF జవాన్లు మంచి సేవలు చేయడానికి రంగంలో దిగుతారు.NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) జవాన్లు పారా మిలిటరీ లో మంచి ఫిజికల్ ఫిట్ ఉన్నవారిని సెలెక్ట్ చేసి NSG/SPG లోకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దేశ కేంద్ర ,రాష్ట్ర మంత్రులకు X,Y,Z ప్లస్ సెక్యూరిటీ గా సేవల్ చేస్తూ మంత్రుల ప్రాణాలకు బాడీ గార్డ్ గా ఉన్నారు. ఇవే కాకుండా అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా పారా మిలిటరీ బలగాలను కోరుకొని నియమిస్తారు.
ఇలా దేశ సేవలో ఉంటూ భార్య, పిల్లల ప్రేమ నోచుకోలేక, తల్లి దండ్రులకు సేవలు చేయలేక, శుభ కార్యాలకు హాజరుకాలేక కుటుంబ సభ్యుల మరణ వార్త వచ్చిన వారి అంతిమ క్షణాలలో ముఖం కూడా చూడలేక ఎన్నో దుఃఖాలను దిగమింగుకుని సహించికొని దేశ రక్షణ ప్రధమ కర్తవ్యం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న ఈ పారా మిలిటరీ బలగాలు సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించక వీరికి కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా 2004 నుంచి తీసేసారు మరియు అనేక సంక్షేమ పథకాలు 2012 సంవత్సరంలో అమలు చేస్తే వీరి కుటుంబాలకు ఇంత వరకు అందడం లేదు. మరియు ఈ విషయాలను నేటి విద్యార్థులకు తెలియటం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసు కోవలసిన భాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అని శ్రీ పి.గోవింద గారు ఎక్స్ బి ఎస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, శ్రీ పి. హెచ్.వెంకటరావు గారు ఎక్స్ సి. ఆర్. పీ. ఎఫ్. హెడ్ కానిస్టేబుల్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకొని చెప్పి, దీని మీద విద్యార్థులకు అవగాహన కలిగించడానికి క్లాస్ నిర్వహించారు
ఈ విషయాలు ప్రతి విద్యార్థి తల్లి దండ్రులు తెలుసుకోవాలి రేపు ఈ విద్యార్థులు ఈ పారా మిలిటరీ బలగాలులో జాయిన్ అవుతారు అప్పుడు ఇవ్వన్నీ గుర్తు కు రావాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహా రాజా కాలేజ్ & జెడ్.పి.హెచ్.స్కూల్,కుమరాం ప్రిన్సిపల్ గారు కాలేజ్ స్టాఫ్, విద్యార్డులు , ఎన్. సి. సి. కేడర్ సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు
ఇట్లు
విజయనగరం ఎక్స్ పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ
👇👇👇👇👇👇👇