సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాలలందరూ కలిసి పోరాడాలి*

సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాలలందరూ కలిసి పోరాడాలి* 
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది* 

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలోని మంగళవారం దుర్గమ్మ అవ్వ గుడి ఆవరణంలో ఎంపీటీసీ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ సాయిరాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు,మహానంది,నాయకులు చంద్ర,లింగప్ప,మాట్లాడుతూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చానా బాధరకరమని దీనివల్ల దళితుల మధ్యన చిచ్చుపెట్టే విధంగా ఆ తీర్పు ఉందని ఆయన అన్నారు, బిజెపి తెలుగుదేశం ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని మార్చే విధంగా రిజర్వేషన్లను క్రమబద్ధీకరంగా ఎత్తివేసే విధంగా కుట్ర జరుగుతుందని దీనికి మాలలంతా ఐక్యమత్యంతో ఉంటూ పోరాటాలకు సంసిద్ధం కావాలని వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారన్నారు, కార్యక్రమానికి మాలలంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని దళితులు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున గాదిలింగప్ప మారేష్ ఎంకప్ప దర్గప్ప కిష్టప్ప నరసప్ప హనుమప్ప లోకప్ప ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.