చైర్మన్ రామకృష్ణ వైస్ చైర్మన్ గా ఈశ్వరమ్మ!
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహర్వి జడ్పీ హెచ్ స్కూల్ నందు స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించగా, ఈ నెల 8 తేదిన ఎన్నికలు వాయిదా పడ్డాయి, కనుక ఈరోజు శనివారం ఉదయం 10 గంటల నుండి జడ్పీహెచ్ స్కూల్ నందు స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికలు పకడ్బందీగా పోలీస్ బందోబస్తుతో పాఠశాల ఉపాధ్యాయుల, విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో తరగతికి ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకొని వారి నుండి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యాయులు అందులో జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ గా హెచ్. రామకృష్ణ, వైస్ చైర్మన్ గా ఈశ్వరమ్మ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా రామకృష్ణ మాట్లాడుతూ నన్ను స్కూల్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ముందుగా విద్యార్థులు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు మెరుగైన విద్యను మెనూ ప్రకారం మంచి భోజనం విద్యార్థులకు సమస్యలు రాకుండా ప్రధాన ఉపాధ్యాయులు చూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ మల్లికార్జున,పాఠశాల హెచ్,ఎం, హుస్సేన్ సాబ్, రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థులు తల్లిదండ్రులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,