కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన.
ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలంలోని మాదాపురం గ్రామంలో సర్వేనెంబర్ 759/a 700/1 759/A1 విస్తీర్ణం ఐదు ఎకరాలు చొప్పున దాదాపు 12 మంది రైతులకు 60 ఎకరంల భూమి 2005 సంవత్సరంలో మాదిగ కులానికి చెందిన వారికి అసైన్మెంట్ కమిటీ ద్వారా డీ పట్టాలు మంజూరు చేసి పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ చేశారు ఈ భూములను రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి మాదిగలకు చెందిన డీ పట్ట భూములను ఆన్లైన్ నందు అడంగల్ వన్ బి అక్రమార్కులకు ఎక్కించి ఉద్దేశపూర్వకంగా నెర పూరితమైన కుట్రకు పాల్పడి డి పట్టాదారులకి మోసం చేశారు వారిపై విచారణ చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేసి అక్రమంగా వెబ్ ల్యాండ్ నందు నమోదు చేసిన అడంగల్ 1b రద్దుపరిచి బాధితులకు న్యాయం చేసి
అనంతరం అక్రమార్కులతో చేతులు కలిపి దళితులకు చెందిన భూములను రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఉన్నత కులాలకు అక్రమంగా అడంగల్ వన్ బి ఎక్కించి భూ అక్రమాలకు సహకరించి నేరపూరితమైన కుట్రకు పాల్పడిన క్రిష్ణగిరి మండలం రెవెన్యూ అధికారులను సస్పెండ్ ఫర్ రిమూవ్ చేసి బాధిత డిపట్టాదారులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది
స్పందించిన కలెక్టర్ గారు పత్తికొండ డివిజనల్ ఆర్డీవో గారితో విచారణ చేపించి రిపోర్ట్ చెప్పించుకుని భూ అక్రమార్కులపై అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని తెలపడమైనది
ఈ కార్యక్రమంలో
కర్నూలు జిల్లా ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ
మాదాపురం గ్రామ బాధితులు తదితరులు పాల్గొన్నారు