అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-పాలకులు జిల్లా మండలధికారులు ముంపు ప్రాంతాలను రైతు పంట పొలాలను పరిశీలించలని,అఖిల భారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకులు బోయ ముని స్వామి డిమాండ్ ,అనంతరం వారు మాట్లాడుతూ,కర్నూలు జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు హంద్రీ పరివారక ప్రాంతాల్లో రైతు పంట నీటితో మునిగి నష్టపోవడం జరిగిందని వంకలు,వాగులు పొర్లి నీటి మునక వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన హాలార్వి బళ్లారి నుండి ఆలూరుకు పోవు రోడ్డుకు అడ్డంగా రైతులతో కలిసి ఆందోళన నిర్వహించడం జరిగింది ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకులు బోయ మునిస్వామి మాట్లాడుతూ హాలర్వి మండలంలో 2300 ఎకరాలు నీటిలో
 మునిగి పోవడం జరిగిందని,పత్తికొండ కౌతాళం, దేవనకొండ , హాలర్వి,ఆస్పరి ,చిప్పగిరి, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో రైతులు వేసిన వేలాది ఎకరాలు పంట నీటితో మునిగిపోవడం కొట్టుకుపోవడం పాడైపోవడం జరిగింది రైతులు వేసిన పత్తి వేరుశనగ కంది టమోటా ఉల్లి మిరప రకాల పంటలన్నీ కూడా నీట మునిగి పోయాయి పెట్టుబడి పెట్టి ఎరువులు మందులు విత్తనాలు సేద్యపు ఖర్చులు కూలీ ఖర్చులు భరాయించి ప్రతి ఎకరాకు 40, 000 నుండి 50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెడితే ప్రకృతి కన్నెర చేయడం వలన రైతు పంట అంతా నీటి మునకతో మునిగిపోయి నష్టం జరిగిందని రాత్రనకా పగలనకా కష్టపడి నారు పోసి నీరు పోసి విత్తు విత్తి .అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే రైతుకు కన్నీటి కష్టాలు మిగిలి నాయని నష్టాల పాలవుతున్నారని ఎప్పుడు కరువు పరిస్థితుల అనుభవిస్తూ పాలకులు వైఫల్యాల వలన రైతులు నష్టపోతు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వలసలు వెళుతున్నారని ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు దేశంలో రైతు మాత్రమే అనుభవిస్తున్నారని దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కరువులో పుట్టి కరువలో పెరిగి కరువులో చనిపోతున్నాడని ఈ రైతులను ఆదుకునే దాని కొరకు వరద ఉధృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు జిల్లా అధికారులు మండల అధికారులు పరిశీలించి నివేదికలు తయారుచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతులకు ఆర్థిక సహాయం అందించి ఎరువులు విత్తనాలు మందులు ఉచితంగా ఇవ్వాలని రైతుల ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రాస్తోరోకో సందర్బంగాడిమాండ్ చేస్తున్నాము అని అఖిలభారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకులు బోయ మునిస్వామి తెలిపారు ఈ రాస్తారోకో కార్యక్రమంలో వీరేష్ ,గాది లింగ ,అంజి ,హేమంత్, అన్నమయ్య ,శివప్ప, చాకలి రమేష్ ,దర్గప్ప ,నాగరాజు, మేఘనాథ్ ,రంగప్ప, రంగన్న ,బొట్టురంగడు ,ఈరన్న, వడ్ర ,తదితరులు పాల్గొన్నారు