అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి

వి 3 టివి న్యూస్ అమరావతి : 

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చాను. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం.