V3 న్యూస్ కౌతాళం::
కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ గోవిందు అధ్యక్షతన స్వర్ణ గ్రామ పంచాయతీ అనే గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి ఉపాధిహమి పథకంలో అమలయ్యే వివిధ రకాల పనులు గురించి ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం గ్రామంలో ప్రధాన సమస్యలు త్రాగునీరు,సిమెంట్ రోడ్లు,డ్రైనేజీలు రైతుల సమస్యలు మరియు మౌలిక సదుపాయాల పైన చర్చించి అనంతరం ప్రజల వివిధ రకాల అర్జీలను ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు తెలియజేశారు కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు,సచివాలయం సిబ్బంది, విద్యుత్ అధికారులు గ్రామ పెద్దలు మరియు ఎంపీటీసీ కురువ అయ్యన్న గారు,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగ ,బసవరాజు ,గిడ్డయ్య ,బీమన్న,రామాంజులు,రమేష్,రంగస్వామి,హనుమంతు,వీరేష్,భిమేష్,డేవిడ్,శాంతరాజ్, స్వామిదాస్,చిన్న మరియు రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..