కోడుమూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .

కోడుమూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ . 

• మహిళలపై నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలి.

• రికార్డులను పరిశీలించి జిల్లా ఎస్పీ.


వి 3 టివి న్యూస్ కర్నూలు :

కోడుమూరు పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.   
పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసు కున్నారు. పలు సూచనలు, సలహాలు సిబ్బందికి తెలియచేశారు. 
అన్ని గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏయే కేసులు ఏ యే కోర్టు ల పరిధులలో ట్రయల్ జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. 

రికార్డులను పరిశీలించారు.

పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు.
బాధితులు పోలీసుస్టేషన్ ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. 
జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, కోడుమూరు ఎస్సై ఎపి శ్రీనివాసులు ఉన్నారు.