వి3 టివి న్యూస్ కర్నూలు :
కర్నూలు మండలం, బాలాజీ నగర్, ముద్దాయి షేక్ జహీర్ బాష ఇంటి వద్ద కర్నూలు తాలూకా UPS CI M.శ్రీధర్, వారి సిబ్బంది అయిన WPC 3096 వెంగమ్మ, PC 3925 K. రమేష్, PC 2091 G.A.మద్దిలేటి లతో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది.
వివరములలోనికి వెళితే కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోన కర్నూలు మండలంలోని బాలాజీ నగర్ నందు నివాసముంటున్న షేక్ జహీర్ బాష, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నందు అసిస్టెంట్ గ్రేడ్ -3 ఉద్యోగి గా పని చేస్తూ, బాలాజీనగర్ లో ఉన్న తన చెల్లెలు షేక్ ఆయేషా భాను మరియు తన చెల్లెలు భర్త అయిన షేక్ మహమ్మద్ జాకీర్ ముగ్గురు కలిసి సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అమాయకులు అయిన నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు సంపాదించాలని కర్నూల్ టౌన్ లోని రామచంద్రనగర్ కు చెందిన నిరుద్యోగి అయిన షేక్ అబ్దుల్లా అను వ్యక్తి నుండి Rs.2,08,000/- మరియు కర్నూల్ టౌన్ కు చెందిన ఇంకా కొంత మంది నుండి కూడా డబ్బులను తీసుకొని ముద్దాయిలు ముగ్గురు కలిసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన నకిలీ సీల్ లు, లెటర్ ప్యాడ్ లు, రాజముద్రలు తయారు చేసి డబ్బులు కట్టిన వారికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ లు ఇచ్చి వారికి అనుమానం రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని నెలలు జీతాలు ఇచ్చి వారికి నమ్మకం కలిగించిన తరువాత అది నమ్మి చాలా మంది వ్యక్తులు ఉద్యోగం కొరకు డబ్బులు కట్టించుకొని మోసం చేశారు. సదరు ముద్దాయిలను 21.08.2024 తేదీన మధ్యాహ్నం సుమారు 2.00 గం,లకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది.
ముద్దాయిలు :
1. షేక్ జహీర్ బాష, వయస్సు 38 సం, లు, తండ్రి పేరు అర్షద్ బాష, r/o H.No.2-16-7, బాలాజీ నగర్, కర్నూల్ మండలం.
2. షేక్ ఆయేషా భాను, వయస్సు 25 సం.లు, భర్త షేక్ మహమ్మద్ జాకీర్, బాలాజీ నగర్, భాష్యం స్కూల్ వద్ద, కర్నూల్ మండలం.
3. షేక్ మహమ్మద్ జాకీర్ , వయస్సు 25 yrs, తండ్రి చాంద్ బాష , కర్నూల్ టౌన్.
ఇందుమూలముగా నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ తరపున తెలియజేయడం ఏమనగా సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికించే వ్యక్తులను నమ్మి అధిక మొత్తంలో ఆ డబ్బులు కట్టి మోసపోవద్దని, అటువంటి వారిని నమ్మవద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మ బలికిస్తున్న వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా పోలీస్ అధికారులకు తెలియపరచవలసిందిగా మరియు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో చదువుకున్న అమాయక వ్యక్తులను మోసం చేయాలనే వారిపై కఠినమైన చర్యలు తప్పవని పోలీస్ అధికారుల హెచ్చరిక.