నేరాల నియంత్రణకు కృషి చేయాలి .... జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్

నేరాల నియంత్రణకు కృషి చేయాలి .... జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్   

....పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ... జిల్లా ఎస్పీ.


వి 3 టివి న్యూస్ కర్నూలు : 

దొంగలించబడిన ప్రాపర్టీలు రికవరీ చేయాలి... బాధితులకు న్యాయం చేయాలి. .
కేసుల దర్యాప్తులు త్వరగా పూర్తి చేయాలి. 
విధుల్లో మంచి ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు , సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేసిన ... జిల్లా ఎస్పీ . 
 పెండింగ్ కేసులు తగ్గించాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు. 
ఈ సంధర్బంగా మంగళవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిఐలు, ఎస్సైల తో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడారు.  
కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు.
 పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 
పోలీసు, న్యాయ శాఖలు కలిసి కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేయుటకు తీసుకోవలసిన చర్యల గురించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. 
 ఇప్పటినుండే ప్రాపర్టీ రికవరీలు బాగా చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే వచ్చే నెల నేర సమీక్షా సమావేశంలో శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 
పోలీసుస్టేషన్ల ను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
 ఎస్సై ఆ పై స్ధాయి అధికారులు బాధితులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలన్నారు. 
సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 
నేరాల నివారణకు ప్రజలతో సత్ససంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాత నేరస్తుల పై ప్రత్యేక నిఘా ఉంచాలి. 
వినాయక చవితి, దసరా వంటి పండుగలను ప్రజలు ప్రశాంతవాతావరణంలో జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
విగ్రహాల దగ్గర సిసి కెమెరాలు, కాపాల ఒకరు ఉండే విధంగా వినాయక విగ్రహాల నిర్వహకులు చర్యలు తీసుకునే విధంగా చేయాలన్నారు. 
శాంతియుత సమావేశాలు ఏర్పాటు చేయాలి. అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. 
నిమజ్జనాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. 
పోలీసు గస్తీ, విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. 
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో పికెట్ లలో ఏలాంటి సమస్యలు లేకుండా గట్టి నిఘా ఉంచాలి. 
అసాంఘిక కార్యక్రమాల పై గట్టి చర్యలు తీసుకోవాలి. 
డిఎస్పీలు ఆయా సర్కిల్స్ పోలీసు అధికారులకు కాలపరిమితి నిర్ణయించి కేసులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
మహిళ ల పట్ల జరిగే నేరాల పై ప్రత్యేక దృష్టి సారించి నివారించాలన్నారు. 
దొంగలించబడిన కేసులలో ప్రాపర్టీ రికవరీలు చేయాలన్నారు. 
సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు న్యాయం చేయాలన్నారు.
వారి యొక్క బ్యాంకు ఖాతాలలో ఫ్రీజ్ చేసి నగదు బాధితులకు అందే విధంగా కృషి చేయాలన్నారు.  
పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయాలన్నారు. సి సి టి ఎన్ ఎస్ గురించి అందరూ తెలుసుకోవాలి.
CCTNS లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
కౌంటర్ ఫీట్, ఎన్డీపీస్, మర్డర్ , రోడ్డు ప్రమాదాలు , నాన్ బెయిలబుల్ వారెంట్లు, మిస్సింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.
విధులలో ప్రతిభ కనబరచిన పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందన...
విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసులను ప్రతి నెల నేర సమీక్షా సమావేశంలో అభినందిస్తామన్నారు.
 అత్యవసర , విపత్కర పరిస్థితులలో మానవత్వంతో స్పందించి ఆదుకొని ప్రజల మన్నలు పొందాలన్నారు.  
1) గాజుల దిన్నె చెరువులో ఐరన్ బండ , గంజిహాళ్ళి గ్రామ రైతులు చెరువు నీటిలో చిక్కుకున్న 32 మంది ప్రజల ప్రాణాలు కాపాడిన గోనెగండ్ల పోలీసులను అభినందించారు. 
ఈ సంధర్బంగా సిఐ ఎ . గంగాధర్ , హెడ్ కానిస్టేబుల్ డి. శ్రీరాములు, కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య, వెంకటేశ్వర్ల కు ప్రశంసా పత్రాలు అందజేశారు. 
2) కర్నూలులో గంజాయి అమ్మేవాళ్ళ ను పట్టుకొని జైలుకు పంపినందుకు కర్నూలు మూడవ పట్టణ ఎస్సై మన్మథ విజయన్ ను అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు. 
3) గూడురు కు చెందిన బంగారం వ్యాపారి దమామ్ వెంకటేశ్వర్లు కిడ్నాప్ కేసును చేధించేందుకు సహకరించిన( అప్పట్లో నాగాలాపురం ఎస్సై) కోడుమూరు ఎస్సై ఎ. పి శ్రీనివాసులు చేసిన కృషిని జిల్లా ఎస్పీ అభినందించారు. 
ఈ నేర సమీక్షా సమావేశంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, వెంకట్రామయ్య, సోమన్న, ట్రైనీ డిస్పీ ధీరజ్, మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.