• నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .
• మంత్రాలయం ఆరాధన ఉత్సవాల భధ్రతా ఏర్పాట్లను పరిశీలించిన … జిల్లా ఎస్పీ.
వి 3 టివి న్యూస్ కర్నూలు :
మంగళవారం కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మంత్రాలయం దగ్గర తుంగభద్ర నది పరివాహాక ప్రాంతాన్ని పరిశీలించారు.
SDRF పోలీసు బృందాలతో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
అప్రమత్తంగా ఉండాలన్నారు.
భక్తులు, చిన్నపిల్లలు, ప్రజలు నది వరద ఎక్కువగా ఉన్నప్పుడు నదిలోకి వెళ్ళకుండా అప్రమత్తం చేయాలని పోలీసులకు తగు సూచనలు తెలియజేశారు.
ఈ నెల ఆగష్టు 18 నుండి 24 వ తేది వరకు జరిగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల సంధర్బంగా జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, క్యూలైన్ , విఐపిల ప్రోటోకాల్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఇంచార్జ్ ఆదోని డిఎస్పీ కి, మంత్రాలయం సిఐ కి పలు సూచనలు , సలహాలు తెలిపారు.
అనంతరం మంత్రాలయం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ తో పాటు ఆదోని డిఎస్పీ సోమన్న, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, మంత్రాలయం సిఐ రామాంజులు, ఎస్సైలు ఉన్నారు.