ప్రతి మహిళ లక్షాధికారి కావాలి. వెలుగు పీడీ.

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి. వెలుగు పీడీ.

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-ప్రతి పొదుపు లక్ష్మి మహిళలు లక్షాధికారులు కావాలని వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ సలీం భాష అన్నారు బుధవారము హలహరి మండలం గుళ్యం గ్రామంలో జీవనోపాధి కార్యక్రమాలను పరిశీలించారు గ్రామంలో ఎంబ్రాయిడింగ్. మరియు ఇస్తరాకుల తయారీ. జొన్న రొట్టెల తయారీ కేంద్రాల పరిశీలించారు ప్రతి మహిళ జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టుకోవడానికి లక్షల నుండి 5 లక్షల వరకు వ్యక్తిగత లోన్లు బ్యాంకు ద్వారా మంజూరు చేయిస్తున్నామని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామంలో అనంతరము గ్రామంలో తల్లిదండ్రులు చనిపోయి అనాధగా ఉన్న కుటుంబాల్ని ఆయన సందర్శించారు ముగ్గురు పిల్లలు ఉండి పిల్లవాడు వికలాంగుడయ్యింది పెన్షన్ రాకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సదరం క్యాంపు నందు సర్టిఫికెట్ మంజూరు చేయించి పెన్షన్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు అనంతరం హల హరిమండల సమైక్య కార్యాలయమును సందర్శించారు సిబ్బందితో రివ్యూ నిర్వహించి ప్రభుత్వ పథకాలు ప్రతి మహిళకు అందేలా చూడాలని. అవగాహన కల్పించాలని తెలిపారు అనంతరం మండల సమైక్య భవనంలోనీ సమస్యలను మహిళలకు బాత్రూం సౌకర్యము తాగునీటి సౌకర్యము కాంపౌండ్ వాల్ తదితర సమస్యలను సిబ్బంది పిడి గారి దృష్టికి తెచ్చారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ నవీన్ ఎల్ సి వీరేష్ సీసీలు గోవిందప్ప మౌలా సాబ్ అకౌంటెంట్ నరసింహులు వివోఏలు గోవిందప్ప గంగప్ప ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు