మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశా కార్యకర్తలకు వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణిల ఆధ్వర్యంలో ఆశ డే సమావేశం జరిగింది. ఆశా డే సమావేశంలో వైద్యాధికారిని డాక్టర్ శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష అని తెలిపారు. తల్లిపాలు కల్తీ లేనివని, ఖర్చు లేని వని, ఎప్పుడైనా ఎక్కడైనా శిశువు కు తల్లిపాలు ఇవ్వవచ్చు మరియు తల్లిపాలు తాగిన బిడ్డ అంటువ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారని, శిశు జన్మించిన అరగంటలోపే తల్లిపాలు తాగించాలని , తల్లులు వ్యక్తిగత పరిశుభ్రత మరియు చేతుల శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా ,ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ, సూర్యనారాయణ, హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య కార్యకర్తలు అంజలి, లక్ష్మీ, మాబున్నీ, పద్మావతి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.