ప్రతి సమస్యను పరిష్కరించండి*

*ప్రతి సమస్యను పరిష్కరించండి*

నగరపాలక సంస్థ;

V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్:

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌యస్) కార్యక్రమానికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ సూచించారు. సోమవారం నగరపాలకలో నిర్వహించిన పిజిఆర్‌యస్‌కు 14 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటినీ పారదర్శకత జవాబుదారీతనంతో పరిష్కారించాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఆర్ఓ జునైద్, ఏసిపి మంజులత, సెక్రటరీ నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.