పత్తికొండ నూతన డిఎస్పిని కలిసిన చిప్పగిరి మాజీ సర్పంచ్ గోవిందన్న,

పత్తికొండ నూతన డిఎస్పిని కలిసిన చిప్పగిరి మాజీ సర్పంచ్ గోవిందన్న,   
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-పత్తికొండ నూతన డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి.వెంకటరామయ్యను చిప్పగిరి మాజీ సర్పంచ్ సి.గోవిందన్న మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఆదివారం పత్తికొండలోని డిఎస్పీ కార్యాలయంలో వెంకట్రామయ్యను మాజీ సర్పంచ్ గోవిందన్నతో పాటు ఆలూరు టీవీ9 ప్రతినిధి కోటి,సూర్య తెలుగు వెలుగు రాయలసీమ కోఆర్డినేటర్ కేఎన్ గోవిందరాజులు,కుందనగుర్తి మాజీ సర్పంచ్ తనయుడు పురుషోత్తం,జ్యోతి రిపోర్టర్ సి.క్రిష్ణమూర్తి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో అన్ని గ్రామాలలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా ఎలాంటి అల్లర్లు,గొడవలు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిఎస్పి వెంకట్రామయ్యను కోరారు. ఇందుకు స్పందించిన డి.ఎస్.పి వెంకట్రామయ్య స్పందిస్తూ ఆలూరు,పత్తికొండ నియోజకవర్గంపై తనకు పూర్తిగా అవగాహన ఉందని,గతంలో కూడా ఆలూరు సిఐ గా విధులు నిర్వహించానని చెప్పారు.కనుక త్వరలోనే డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీల నిర్వహించడంతోపాటు అవగాహన సదస్సులు,సమావేశాలు నిర్వహిస్తూ పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించి శాంతి భద్రతలే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నవారు నేరుగా పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని, ఎవరు కూడా మధ్యవర్తలను ఆశ్రయించవద్దని డిఎస్పి వెంకటరామయ్య సూచించారు.ముఖ్యంగా రౌడీ శీటర్లను,చెడునడత కలవారికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రశాంతత జీవనం గడపాలని సూచిస్తామని వారు వివరించారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టిసారించి వారిలో మార్పు రాకపోతే పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.