విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .

వి 3 టివి న్యూస్ కర్నూలు:


 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 97 ఫిర్యాదులు .

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ.
 
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం మొత్తం 97 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ...

1) కోడుమూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు లో గాంధీ వికలాంగుల పొదుపు సంఘం కు చెందిన చంద్రన్న సభ్యుల నుండి డబ్బులు వసూలు చేసి 22 కంతుల మొత్తం, పొదుపు డబ్బులు లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా పరారీలో ఉన్నాడని, ఇంత వరకు బ్యాంకు వారు కూడా ఏలాంటి సమాచారం అందించలేదని దేవనకొండ మండలం , బండగట్టు గ్రామం, ఎస్ బి వీరేష్ ఫిర్యాదు చేశారు. 

2) మా ఇంటిని తనకు గిఫ్ట్ కింద ఇల్లు రాసి ఇచ్చినట్లు , నకిలీ నోటిసు చూపిస్తూ రాము అనే మా బంధువు మమ్మల్ని మోసం చేస్తున్నాడని కర్నూలు , కుమ్మరి గేరి కి చెందిన శకుంతల ఫిర్యాదు చేశారు.

3) మా నాన్నకు కిడ్నీ ఇప్పిస్తానని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేస్తున్న టెక్నీషియన్ నరసింహులు రూ. 3 లక్షలు తీసుకొని మోసం చేశాడని, ఈవిధంగా చాలా మందికి మోసం చేస్తున్నాడని సి. బెళగల్ మండలం, మారం దొడ్డి గ్రామానికి చెందిన రమేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. 

4) హైదరాబాద్ లో కె కె గ్రూప్ ఇన్వేస్టిమెంట్ ట్రేడింగ్ కంపెనీ అని పేరు చెప్పి లక్షకు 10 శాతం కమిషన్ ఇస్తామని రూ. 5 లక్షలు కట్టించుకుని 2 నెలలు మాత్రమే కమిషన్ ఇచ్చి మోసం చేశారని, తెలిసిన వ్యక్తి సోమన్న కూడా అదే విధంగా రూ. 5 లక్షలు కట్టి మోసం పోయాడు. అయితే ఆ డబ్బులు మేమే తెచ్చి ఇవ్వాలని మమ్మల్ని బెదిరిస్తున్నాడని కర్నూలు ఇందిరమ్మ కాలనీ వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు.

5) మా పిల్లలకు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన శ్రేయాస్ అనే వ్యక్తి రూ. 4 లక్షల 30 వేలు తీసుకొని బోగస్ కంపెనీ లో ఉద్యోగాలు ఇప్పించి మోసం చేశాడని డబ్బులు తిరిగి ఇప్పించాలని కర్నూలు కు చెందిన ప్రకాష్ రాజు ఫిర్యాదు చేశారు.

6) రోహిత్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు కలిసి వరంగల్ లో ఉంటున్న ARK Global Solutions పేరుతో BRIT LEELA UK LIMITED లండన్ లో మా కుమారుడికి సాప్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 30 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు కు చెందిన రమేష్ బాబు ఫిర్యాదు చేశారు. 

7) గోనెగండ్లకు చెందిన రఫీక్ అనే వ్యక్తి రాజమండ్రిలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 4 లక్షల 50 వేలు తీసుకోని మోసం చేశాడని కర్నూలు , పెద్ద పడఖానాకు చెందిన విష్ణు ఫిర్యాదు చేశారు.

8) మా అవ్వ పొలాన్ని కౌలుకి తీసుకుని సాగు చేస్తూ ఇనాయతుల్లా అనే వ్యక్తి మా అవ్వ చనిపోయిన తర్వాత మాకు తెలియకుండా దొంగ రిజిష్టరి చేసుకుని పొలం ఆన్ లైన్ చేసుకుని మోసం చేశాడని దేవనకొండ మండలం , కుంకనూరు గ్రామానికి చెందిన నజీర్ ఫిర్యాదు చేశారు. 
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.