పారామిలటరీ భవనాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది



శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట:- ఈరోజు తే.28 ఆగస్టు 2024 ది. స్థానికంగా పైడితల్లి గుడి దగ్గర నూతనంగా నిర్మించిన పారామిలటరీ(సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్) సంక్షేమ భవనాన్ని గౌరవనీయులు నరసన్నపేట ఎమ్మెల్యే గారు శ్రీ బగ్గు రమణమూర్తి గారి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. భవన పూజా కార్యక్రమం పూర్వ సైనికులు శ్రీ గంగిట్ల శ్రీనివాసరావు గారి దంపతుల చేతుల మీదగా జరరగగా, దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ రణబీర్ సింగ్ గారు (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జనరల్ సెక్రటరీ న్యూఢిల్లీ), చింతాడ రంగనాథం గారు 2IC (SSB), అసోసియేషన్ ఇతర రాష్ట్రాల మరియు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల పారామిలటరీ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్) అధ్యక్షులు మరియు తదితర బృందం దీనికి హాజరయ్యారు.

ఈ భవనాన్ని దేశ సరిహద్దులో పహరా కాస్తున్నటువంటి పారా మిలిటరీ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్) సైనికులు తమ సొంత విరాళాలతో నిర్మించుకున్నారని సంఘం అధ్యక్షులు కే రామారావు గారు మరియు Y.A. నాయుడు గారు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.హరినాథ్ గారు,విశాఖపట్నం సెక్రటరీ GSB సుబ్రమణ్యం గారు, ASNN వర్మ గారు,S రవి గారు, మాట్లాడుతూ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సైనికులు (BSF, CISF, CRPF, ITBP, SSB, & AR) దేశ సరిహద్దుల్లోనూ..., అంతర్గతంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటి కూడా ప్రభుత్వం నుండి సైనికులకు లభించాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వీరికి అందకుండా పోతున్నాయనే తమ ఆవేదనను వ్యక్తం పరుస్తూ. దేశ రక్షణలో రాత్రి పగలు సేవ చేస్తున్న CAPF జవాన్లకు OPS ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించాము దాని పై సుప్రీం కోర్ట్ లో న్యాయం చేయమని ఆపిల్ చేశాం తొందర్లో న్యాయం జరిగి మనకు OPS ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది అని జవాన్లు అంత మంది ఆత్మ విశ్వాసం తో సంతోషంగా ఉండాలని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వం ఈ దేశ రక్షకుల సేవలు అన్నింటిని గుర్తించి సంక్షేమ పథకాలలో తగిన స్థానాన్ని కల్పించాలని కొట్ని లక్ష్మణరావు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పూర్వ సైనికులు KVR మూర్తి గారు మాట్లాడుతూ ఈ సంఘం బోలోపేతానికి జిల్లా మొత్తం గా ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దేశ రక్షకులందరూ ఐకమత్యంగా ఏకతాటిపై ఉండడానికి సైనికులు శ్రీ. అట్ల సుమన్ మరియు డోల నాగరాజుల యొక్క కృషి ఎంతో ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మొత్తం పారామిలిటరీ సైనికులు, పూర్వ సైనికులు వారి ఆధారిత కుటుంబ సభ్యులందరూ పాల్గొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు ఈ భవనం వేదిక కానుందని, CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లకు రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ పథకాల అమలుపరచటం పై ప్రస్తుత ప్రభుత్వం పై మాకు నమ్మకం ఉందని తెలియజేశారు.