భారతీయ సంవిధాన్ సభలో బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు*

*భారతీయ సంవిధాన్ సభలో బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు* 
V3 న్యూస్ ::
జాతీయస్థాయిలో బహుజనులంతా ఏకం కావలసిన ఆవశ్యకతపై జరిగిన జాతీయ క్లస్టర్ సమావేశాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ ప్రతినిధుల సమావేశంలో భాగంగా బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అమ్రేష్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది ఆయన భారత రాజ్యాంగ సగౌరవం, సంరక్షణ గూర్చి వేల మందిని ఉద్దేశించి అవగాహన కల్పించారు. ఈ రాజ్యాంగ అవగాహన కార్యక్రమంలో రాజ గృహ అధినేత ప్రదీప్, డేవిడ్ రాజు, జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బిసి రమణ తదితరులు ప్రసంగించారు.