కలకత్తా వైద్యురాలిపై జరిగిన దారుణ సంఘటనను ఖండించిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా.

కలకత్తా వైద్యురాలిపై జరిగిన దారుణ సంఘటనను ఖండించిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా.

........వైద్యులపై దాడుల వెంటనే అరికట్టాలి 

వి 3టివి న్యూస్ కర్నూలు :


ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం
         ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్యని దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి .శ్రీనివాస్ యాదవ్ తెలిపారు
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ శి బి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐi.నరసింహ రాష్ట్రఫెడరేషన్ జాయింట్ సెక్రెటరీ జె. రఘునాథరెడ్డి పాణ్యం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు ఈశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ వైద్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వేళకాని వేళలో ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు
     ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామీణ వైద్యులు నాయకులు రాజేశ్వర్ రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు.