బి 3 టివి న్యూస్ కర్నూలు :
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసులకు , వారి కుటుంబ సభ్యులకు , మీడియా సోదరులకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ తరపున కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కృష్ణాష్టమి రోజు శ్రీ కృష్ణుడు మీ యొక్క ఒత్తిళ్ళను , ఆందోళనలన్నింటినీ తొలగించి మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రేమ, శాంతి మరియు ఆనందాన్ని అందివ్వాలని కోరుకుంటూ జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీకృష్ణజన్మాష్టమి సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి పునాదిని ధృవీకరిస్తుందని శ్రీ కృష్ణుడు తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ పర్వదినం సందర్భంగా ప్రజలలో సోదరభావం, స్నేహం మరియు సామరస్యం మరింత బలోపేతం కావాలని శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.