ఎం.పి బస్తిపాటి నాగరాజు ను కలిసిన డి.ఎఫ్.ఓ శ్యామల

ఎం.పి బస్తిపాటి నాగరాజు ను కలిసిన డి.ఎఫ్.ఓ శ్యామల

ఈ నెల 30 న జరిగే వన మహోత్సవంలో పాల్గొనాలని ఎం.పి ని కోరిన డి.ఎఫ్.ఓ


వి 3 టివి న్యూస్ కర్నూలు : 
జిల్లా అటవీశాఖ అధికారి శ్యామల ఎం.పి బస్తిపాటి నాగరాజు ను మర్యాద పూర్వకంగా కలిశారు.. కర్నూలు మండలం పంచలింగాలలోని ఎం.పి నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా డి.ఎఫ్.ఓ శ్యామల ఈ నెల 30 వ తేదీన రాయలసీమ యూనివర్సిటీ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని ఎం.పి ని కోరారు..అనంతరం అటవీశాఖ కు సంబంధించిన పలు సమస్యలను ఆమె ఎం.పి నాగరాజు తో చర్చించారు...