ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రివర్యులు టీజీ భరత్

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రివర్యులు టీజీ భరత్ 


వి 3 టివి న్యూస్ కర్నూలు ;-

 శుక్రవారం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రివర్యులు టీజీ భరత్ తో కలిసి 2014 టీడీపి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను మరియు నిలిచిపోయిన పనులను పరిశీలించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి . ఇండస్ట్రియల్ హబ్‌లో కొత్త పరిశ్రమల స్థాపన దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు, స్టీల్ ప్లాంట్ అధికారులు, సిబ్బంది, స్ఠానిక నాయకులు పాల్గొన్నారు.