కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ... జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ... జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్

• రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్ ను పరిశీలించిన... జిల్లా ఎస్పీ. 

 
వి 3 టివి న్యూస్ కర్నూలు:-

కర్నూలు నగరంలోని కర్నూలు మూడవ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్   బుధవారం  ఆకస్మిక తనిఖీ చేశారు.

సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు.  సిబ్బందిని సమావేశ పరిచి యోగా, క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ,  సిఐ కి , ఎస్సై లకి  పలు సూచనలు చేశారు. 

 ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్  పరిధిలోని రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ , వార్డు హిస్టరీ షీట్స్ ను పరిశీలించారు. 

ఎప్పటికప్పుడు వారి ఫోటోలను అప్ డేట్ చేయాలన్నారు. 

సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

 సైబర్ నేరాల నివారణ కు అవగాహన కు సదస్సులు నిర్వహించాలన్నారు. 

 పునరావృత నేరస్తు ల పై నిఘా ఉంచాలన్నారు. 

రికార్డులు, రిసెప్షన్‌ , లాకప్, జనరల్ డైరీ, సిబ్బంది వివరాలు, పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తగు సూచనలు చేశారు. 

అనుమానస్పద మిస్సింగ్ కేసులను త్వరగా చేధించాలన్నారు.  

కేసుల వివరాలు గురించి ఆరా తీశారు.  సిబ్బందికి రోటేషన్ పద్దతిన విధులు కేటాయించాలన్నారు. 

సమస్యల పట్ల బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. 

నిరంతరం గస్తీ నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ గారి వెంట  కర్నూలు  మూడవ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ మురళీధర్ రెడ్డి, ఎస్సై మన్మథవిజయ్  ఉన్నారు.