ప్రతి మహిళ లక్షాధికారి కావాలి ...హలహర్వి

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి ...

హలహర్వి టీడీపీ జెడ్పిటిసి లింగప్ప ... 

వి 3టీవీన్యూస్ హాలహర్వి :-ప్రతి మహిళ అభివృద్ధి చెంది లక్షాధికారి కావాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్దేశమని హల హర్వి టీడీపీ జెడ్పిటిసి లింగప్ప అన్నారు. ఆదివారo పొదుపు లక్ష్మి భవనం నందు లక్ పతి దిది ను లాంచ్ చేస్తున్న సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు బ్యాంకుల ద్వారా జీవనోపాధి కార్యక్రమాలకు ఒక లక్ష నుండి 5 లక్షల రూపాయలు వరకు లోన్లు మంజూరు చేస్తుందని అలాగే ఇంకా వేరే 30 స్కీమ్ లు ఉన్నాయని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండలoలో జై హోసల్లి గ్రామంలో ఇస్తరాకుల తయారీ సెంటర్ గుల్యం గ్రామంలో జొన్న రొట్టెల తయారీ సెంటర్ హలహర్వి లో ఎంబ్రాయిడింగ్ ద్వారా తయారు చేసినటువంటి వస్తువులను పరిశీలించారు. మహిళలు చేస్తున్నటువంటి పనులకి జెడ్పిటిసి లింగప్ప ఆనందం వ్యక్తం చేశారు. మీలాగే మండలంలో ఉన్న ప్రతి మహిళలు జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని అన్నారు. అనంతరం మెగా చెక్కులు ఇచ్చి సభ్యులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఎం శివయ్య మండల సమాఖ్య అ ధ్యక్షురాలు వెంకట్ లక్ష్మి, సిసిలు వెంకటరత్నం, మౌలా సాబ్, గోవిందప్పలు, అకౌంటెంట్ నరసింహులు, గ్రామ సంఘం అధ్యక్షురాలు. వివోఏలు, తదితరులు పాల్గొన్నారు..