V3 న్యూస్ కౌతాళం:
మంత్రాలయం నియోజకవర్గం కౌతలం మండలం ఉరుకుంద గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన
శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు బురెడ్డిపల్లి (జోగులాంబ గద్వాల్ జిల్లా) వాస్తవ్యులు ఆర్ శ్రీదేవి వైఫ్ ఆఫ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి వారు ₹.100,001/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో దేవస్థాన ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.