*నగరపాలక సాంకేతిక 'వెలుగులు'*

*నగరపాలక సాంకేతిక 'వెలుగులు'*

నగరపాలక సంస్థ;
V3 టీవీ న్యూస్ కర్నూలు టౌన్:

నగరంలో విద్యుత్ దీపాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో దాదాపు 25,000 వేల వీధి దీపాలు ఉన్నాయని, వాటికి అనుసంధానంగా 986 సిసిఎంఎస్ బాక్సులు ఉన్నాయన్నారు. ఒకొక్క సిసిఎంఎస్ బాక్సు కింద 100 నుండి 200 వరకు వీధి దీపాలు ఉంటాయన్నారు. వీటన్నింటినీ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టం (ఓఎంఎస్) పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించామని కమిషనర్ పేర్కొన్నారు. దీని ద్వారా మరమ్మతులకు గురైన వీధి దీపాలను వేగంగా గుర్తించవచ్చని, తద్వారా తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకువచ్చన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చి, పరిష్కారం చేసే ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించి గురువారం ఎమినిటీస్ సెక్రెటరీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్, వాటేజ్‌ల వారీగా వీధి దీపాల వివరాల సర్వేను వెంటనే ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది ఓఎంఎస్ సర్వేను గురువారం నుంచే ప్రారంభించారు.