మహిళలు మరియు బాలికల పై లైంగిక వేధింపులను అరికడదాం ...

మహిళలు మరియు బాలికల పై లైంగిక వేధింపులను అరికడదాం ... 
జిల్లా న్యాయ సేవా సంస్ధ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, 

వి3 టివిన్యూస్ కర్నూలు : 


చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మనోహర్.
ఎవరైనా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే విద్యార్దులకు ఉద్యోగాలు రావు.
ఎక్కడైనా ప్రజలు, మహిళలు, బాలికలకు సమస్యలుంటే పోలీసు డయల్ 100 నెంబర్ సమాచారం అందించండి.

కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు మహిళా పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని జోహారాపురం లో ని ST. Ann’s ఇంగ్లీషు మీడియం స్కూల్, జోహారాపురం అంబేద్కర్ స్మారక ప్రభుత్వ పాఠశాలలోని 9 వ తరగతి, 10 వ తరగతి విద్యార్దులకు మరియు అక్కడి ప్రజలకు, విద్యార్దుల తల్లిదండ్రులకు మహిళలు మరియు బాలిక ల పై జరిగే లైంగిక వేధింపులను అరికడదాం విషయం పై అవగాహన సదస్సు నిర్వహించారు. 


ఈ సంధర్బంగా జిల్లా న్యాయ సేవా సంస్ధ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ...

ఇంటి నుండి స్కూల్ కు వెళ్ళై సమయంలో ఎవరైనా మహిళలు, బాలికల పట్ల ఈవ్ టీజింగ్ చేస్తే పోలీసులకు లేదా డయల్ 100 లేదా 181 లేదా 112 లేదా చైల్డ్ లైన్ 1098 కు గాని, స్కూల్ టీచర్లకు గాని సమాచారం అందించాలన్నారు. 

 చట్టాన్ని గౌరవిస్తే చట్టం రక్షిస్తుందన్నారు. బాల్య వివాహాలు చేయరాదన్నారు. తెలియని వయస్సులో ఆకర్షణకు లోనై తప్పులు చేస్తే జీవితాంతం బాధ పడవలసి వస్తుందన్నారు. ఆకర్షణ కు గురి కాకుడదన్నారు. 
 మైనర్లు బైక్ లు నడపడం మంచిది కాదన్నారు. వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అన్నారు. 

చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మనోహర్ మాట్లాడుతూ...

భయం లేకపోవడం , పెద్ద శిక్షలు పడకపోవడం వలనే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. 

ఇటీవల కలకత్తా, నందికోట్కూరు వంటి ప్రదేశాలలో మహిళల పై జరుగుతున్న దాడుల గురించి తెలియజేశారు. ప్రతి పాఠశాలలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి బాలికలకు స్కూల్ టీచర్లు అవగాహన చేయాలన్నారు. పోక్సో , లైంగిక వేధింపుల చట్టం గురించి అవగాహన చేశారు. కేసుల శిక్షల గురించి తెలియజేశారు. 

తెలియని వ్యక్తులు దగ్గరకు వచ్చినప్పుడు మహిళల, బాలికలు గట్టిగా అరవడం, కేకలు వేయడంతో చాలా సంఘటనలు జరగవన్నారు. 

మహిళా పోలీసుస్టేషన్ సిఐ అబ్దుల్ గౌస్ గారు మాట్లాడూతూ.... 

విద్యార్ధులు, విద్యార్ధినులు సోషల్ మిడియా కు, ఇంటర్నెట్ కు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు అనవసరంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇవ్వకూడదన్నారు. పిల్లలను గమినిస్తూ ఉండాలన్నారు. 
కొందరు తెలియని విషయాలను ఫార్వర్డ్ చేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారన్నారు. 

 ఎంతో అవసరమైతే చదువు పరంగా మాత్రమే సోషల్ మిడియా వినియోగించాలన్నారు.

కర్నూలు ఒకటవ పట్టణ సిఐ రామానాయుడు మాట్లాడుతూ...

ఎవరికైనా ఎమైనా సమస్యలు వస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. పోలీసులను అప్రమత్తం చేస్తామన్నారు.
 
కిడ్నాపింగ్, మిస్సింగ్ , హింసకు గురవుతుంటే బాధితులు తెలియజేయాలని ఒన్ స్టాప్ సెంటర్ వారు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో కర్నూలు మహిళా పోలీసుస్టేషన్ సిఐ అబ్దుల్ గౌస్, కర్నూలు ఒకటవ పట్టణ సిఐ రామయ్యనాయుడు, ఎస్సై నిర్మలమ్మ ఐసిడిఎస్ సిడిపిఓ శారధ, ఒన్ స్టాప్ సెంటర్ మేరి స్వర్ణలత ఉన్నారు.