వి 3 టివి న్యూస్ కర్నూలు:
నది నీటిలో చిక్కుకున్న గంజిహళ్లి గ్రామానికి చెందిన 25 మందిని , ఐరన్ బండ గ్రామానికి చెందిన 7 మందిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, పోలీసు కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య , వెంకటేష్ ను అభినందించిన.... జిల్లా ఎస్పీ .
జిల్లా ఎస్పీ కి , పోలీసులకు ధన్యవాధాలు తెల్పిన.... ఐరన్ బండ గ్రామస్తులు.
ఐరన్ బండ గ్రామస్తులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించిన ...జిల్లా ఎస్పీ.
గాజుల దిన్నె చెరువు ను సందర్శించి, ప్రాజెక్టు ఉన్న గేట్లను బుధవారం కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ పరిశీలించారు.
గాజుల దిన్నె ప్రాజెక్టు వచ్చిన నీటి ఉదృతి దృష్టిలో ఉంచుకొని
గోనెగండ్ల మండలం , గంజి హళ్ళి, ఐరన్ బండ ఉన్న గ్రామాల ప్రజలు నీటిలో చిక్కుకొని ప్రాణాలు కాపాడుకున్న జరిగిన సంఘటన దృష్ట్యా, ఐరన్ బండ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ప్రజలతో మాట్లాడారు. ఎమైనా సమస్యలు ఉంటే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 100 సమాచారం అందించాలన్నారు.
అక్కడ సంబంధిత నీటిపారుదల అధికారులతో మాట్లాడారు.
చెరువు చుట్టు ప్రక్కల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గోనెగండ్ల మండలం, గంజి హళ్ళి పొలానికి వెళ్ళి, ఐరన్ బండ గ్రామస్తులు పొలాలకు నీటిని తోడే మోటార్ల తీసుకోని వచ్చే సందర్భంలో, అనుకోకుండా చెరువు లో చిక్కుకొని, బయటకు వచ్చే సందర్భం లొ చెరువు మధ్యలో ఉన్ననదిగుండు పైన ఉండి, ప్రాణాలు కాపాడుకున్నారు.
చెరువు నీటి మధ్యలో చిక్కుకున్న వారిని పవర్ బోటు ద్వారా, మత్య్స కారుల సహకారం తో పోలీసులు ఒడ్డు చేర్చి రక్షించడము జరిగింది.
పోలీసులు అప్రమత్తం అయి వెంటనే నదిలో చిక్కుకున్న ప్రజలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ గారి కి, పోలీసులకు ఐరన్ బండ గ్రామ ప్రజలు ధన్యవాధాలు తెలిపారు.
జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.