......ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి
...కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాకి వినతిపత్రం అందజేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
వి 3 టివి న్యూస్ కర్నూలు:-
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాల ను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు...ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలతో పాటు, తెలంగాణా, కర్ణాటక జిల్లాల వాసులకు కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు కలిపించేందుకు అవకాశం ఉంటుందన్నారు.. ఇక ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించినప్పటికి ఇప్పటి వరకు కేవలం 50 శాతం పనులు మాత్రామే పూర్తి అయ్యాయన్నారు.. ఈ కళాశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే ఆదోని మండలంతో పాటు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోసిగి, ఆలూరు, కౌతాళం మండలాల వాసులకు అవసరమైన వైద్య సేవలను అందించవచ్చని నాగరాజు తెలిపారు.