ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తో100 రోజులు రాష్ట్ర పాలన,

ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తో100 రోజులు రాష్ట్ర పాలన,

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం నందు ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో100 రోజులు రాష్ట్ర పాలన జరిగిందని, ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు ,ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం100 రోజుల పాలనలో ఏ సంక్షేమ పథకాలు కానీ గ్రామ అభివృద్ధి కానీ పనులు చేపట్టలేదని , ఇది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తో 100 రోజుల పాలనలో అవ్వ తాతలకు పింఛన్లు పెంచి ,విజయవాడలో భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయిన బాధ్యులకు ఆహారకిట్లను అందిస్తూ మరోపక్క రాష్ట్రంలో 175 అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ కార్మికులకు సామాన్య ప్రజలకు 5రూపాయలు భోజనం అందించిన ఘనత సీఎం నారా చంద్రబాబునాయుడు దక్కిందని, ఇది మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం 100 రోజులు పూర్తి చేస్తుందని ఆయన అన్నారు, ముందుగా గ్రామాల్లో ఈనెల 21 నుండి 26 వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ,గ్రామ సభల్లో సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని ,ఆ సమస్యలు గ్రామ సభల్లోని సమస్యలకు పరిష్కారం చేపడతామన్నారు, ముందుగా ఎంపీడీవో కార్యాలయం నందు మొక్కలు నాటడం జరిగింది, ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఇది మన ప్రభుత్వం స్టిక్కర్లు అతికించి మన ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల రాష్ట్ర పాలన లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామ అభివృద్ధి, ప్రజలకు తెలియజేశారు, ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ అధికారి రామాంజనేయులు ఎంపీడీవో టిడిపి మండల కన్వీనర్ సుధాకర్, హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున,సర్పంచ్ తండ్రి నరసప్ప, పాల్ రెడ్డి కృష్ణం నాయుడు ప్రభాకర్, బిజెపి మండల కన్వీనర్ బసవరాజ్ ,కూటమి నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.