భగత్ సింగ్ ఆశయాలు సాధిస్తాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ*
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహార్వి మండలం చింతకుండ గ్రామంలో హైస్కూల్ భగత్ సింగ్ జయం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పూలమాల వేసి నివాళులర్పించారు. *ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గిరిముర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున గౌడ్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మైన మాట్లాడుతూ* భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28వ తేదీ లాయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ లాల లజపతిరాయి మహాత్మా గాంధీ పిలుపులను అందుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు తెలిపారు. ఏడు సంవత్సరాల వయసులో గద్దర్ వీరుడైన కత్తర్ సింగ్ ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేస్తే వాళ్ల చిన్నమ్మకు ధైర్యం చెప్పాడని తెలిపారు. తమ పెరట్లో తుపాకులు నార్తే అవి పెరిగి భారీగా తుపాకులు కాస్తాయి వాటి ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టొచ్చు కదా అని తన తండ్రికి తెలిపిన వ్యక్తి అని అన్నారు. లాలజపతిరాయ్ పై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపితే ప్రతి చర్యగా సాండర్స్ అనే పోలీసును కాల్చి చంపారని ఆ తర్వాత భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విప్లవ పోరాటాలను గ్రంథాలను అధ్యయనం చేసి టెర్రరిజం నుండి మార్క్సిజం వైపుకు, ఆస్తికము నుండి నాస్తికం వైపుకు మారారని తెలిపారు. భగత్ సింగ్ నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికం ఆర్మీ అసోసియన్ పేరుతో ఆనాటి విద్యార్థును యువకులను స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశారని తెలిపారు. స్వతంత్ర పోరాటానికి తూట్లు పొడిసే విధంగా లాలాలజపతిరాయ్ ఇందు మహాస�