బురుజులలో దోమల మందు పిచికారి -అవగాహన ర్యాలీ

బురుజులలో దోమల మందు పిచికారి -అవగాహన ర్యాలీ 

మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి డాక్టర్ రాగిణిల ఆదేశానుసారం బురుజుల గ్రామంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో బురుజుల గ్రామంలో సీజనల్ వ్యాధులు నివారణ జాగ్రత్తల లో భాగంగా దోమల మందు పిచికారి మరియు కీటక జనిత వ్యాధులపై సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా మాట్లాడుతూ ప్రజలు దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ,దోమతెరలు వాడాలని ,వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ,జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకొని పూర్తిగా చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక పాఠశాలలోని విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన కలిగించి వారాంతపు ఐరన్ మాత్రను వేసి, నులిపురుగుల నివారణ దినోత్సవం మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ, కృష్ణమ్మ, పంచాయతీ సెక్రెటరీ, సిబ్బంది, హెల్త్ సెక్రటరీ సరస్వతి ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు