డోన్ మండలం (డోన్ టౌన్): ప్రజలు మార్కెట్లోన బయట ఏదైనా వ్యాపారం చేయాలంటే భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు చాలానే వెలుగు చూస్తున్నాయి. చిన్న, పెద్ద వ్యాపారం అనే తేడా లేకుండా ప్రజలను తూకాలలో చాలా విపరీతంగా మోసం చేస్తున్న దృశ్యాలను పట్టణవాసులు చెప్పుకొని వాపోతున్నారు. నిన్నటి రోజున కొత్తపేట నందు ఒక ఉల్లిగడ్డల వ్యాపారస్తుడు వినియోగదారున్ని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారస్తుడు వినియోగదారునికి 100 రూపాయలకు మూడు కేజీల ఉల్లిగడ్డలను అమ్మినాడు. తనకు తూకంలో ఏదో అనుమానం వచ్చి వాటిని వేరొక చోట తూకం సరి చూచుకోగా కేవలం అవి 2.750 కేజీలు మాత్రమే ఉన్నాయి.తను 250 గ్రాములు ఉల్లిగడ్డల్ని మోసపోయానని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు మనం కూరగాయల మార్కెట్లోనూ, తోపుడు బండ్లలో పండ్లు అమ్మేవాళ్ళు మోసాలు చేయడం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వాటినే కట్టడి చేయాలని ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి వ్యాపారస్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు తమ యొక్క ఆవేదనని డిమాండ్ చేస్తున్నారు.