ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!

ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు!

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో బిజెపి మండల కన్వీనర్ బసవరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా టిడిపి మండల కన్వీనర్ సుధాకర్ టిడిపి యువ నాయకుడు పాల్ రెడ్డి ,అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆలూరు బళ్ళారి ప్రధాన రోడ్డుపై కూటమి నాయకులు కార్యకర్తలతో కేకును కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు, బిజెపి మండల కన్వీనర్ బసవరాజు మాట్లాడుతూ భారత దేశంలో దేశ ప్రధానిగా మూడుసార్లు ప్రధానమంత్రి ఆయన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని నరేంద్ర మోడీ ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమానికి బిజెపి టిడిపి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్ ఎం స్వామి, వీరేష్, శంకర్ గౌడ్ కుమార్ సాబ్ తదితరులు పాల్గొన్నారు,