సమస్యలకు నిలయంగా శ్రీ శక్తి భవనం.... కనీస సౌకర్యాలకు నోచుకోని కార్యాలయం.

సమస్యలకు నిలయంగా శ్రీ శక్తి భవనం....  
 కనీస సౌకర్యాలకు నోచుకోని కార్యాలయం. 
      
 వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన సమస్యలు తీర్చే నాధుడు కరువయ్యారు సమస్యలకు నిలయంగా స్త్రీ శక్తి భవనం మారింది వివరాలకు వెళితే మండల కేంద్రమైన హలహర్విలో పొదుపు మహిళల కోసం2015 నా 30 లక్షల రూపాయలు తో స్త్రీశక్తి భవనం నిర్మించారు అయితే ఆ భవనానికి కనీస సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాత్రూములు మరుగుదొడ్లు నీటి సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహించారు కార్యాలయం లోపల ఉన్నటువంటి గదులకు తలుపులు లేవు అలాగే రూములలోవేసినటువంటి బండలు పగిలిపోవడం జరిగింది దీనితో పాములు తేళ్లు విష సర్పాలు సంచరిస్తున్నాయి దీనితో మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు నెలలో కనీసం రెండు మూడు సమావేశాలు జరుగుతాయి అందుకు 50 మంది దాకా పొదుపు మహిళలు హాజరవుతారు వచ్చిన వారికి బాత్రూము.మరుగుదొడ్డి సౌకర్యం లేక పోవడంతో ముళ్ళ కంప లోకి వెళ్లి పొదల చాటుకు వెళ్ళవలసి వచ్చింది నీ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని మహిళలు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు మహిళలు వస్తూ ఉంటారు ఈ సమస్యలు ఉన్నందువలన కార్యాలయానికి రావడమే మానేశారు ఆఫీసుకు వచ్చే దారిలో ముళ్ళకంపలతో నిండి ఉన్నది సిసి రోడ్ సౌకర్యం లేక ఆఫీసు చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో సమస్యలకు నిలయంగా మారింది స్త్డ్రీ శక్తి భవనం లో ఉన్న సమస్యలను మండల స్థాయి జిల్లాస్థాయి అధికారులకు తెలియజేసిన అలాగే మండల స్థాయి ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఫలితం లేకపోయింది కనీసము క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనైనా స్త్రీశక్తి భవనం కు ఉన్న సమస్యలను తీర్చడానికి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని కనీస సౌకర్యాలు కల్పిస్తారని పోదుపు లక్ష్మి మహిళలు కోరుచున్నారు