వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి రైతు సేవ కేంద్రం పరిధిలో హాలహర్వి గ్రామములో అంజయ్య పొలంలో మంచి వ్యవసాయ పద్ధతుల పొలంబడి నిర్వహించడం జరిగింది రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి మరియు నాణ్యమైన దిగుబడి దీని ద్వారా రైతుకు ఆదాయం ఎక్కువగా వస్తుందని రైతులతో, వ్యవసాయ అధికారి శివశంకర్ అన్నారు ఈ సందర్భంగా ఏవో శివశంకర్ ఆయన మాట్లాడుతూ,1. విచక్షణారహితంగా ఎరువులు మరియు పురుగుమందులు వాడటం ద్వారా భూమి మరియు వాతావరణం కాలుష్యం అవ్వడమే కాకుండా రైతు కూడా అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని రైతులకు తెలియజేయడం జరిగింది,2. రైతులు ఇప్పటి పరిస్థితుల్లో కషాయాల ద్వారా పశువుల పేడ ద్వారా వ్యవసాయం చేసుకుంటే మంచి గిట్టుబాటు ధర మంచి నాణ్యత వస్తుందని తెలియజేయడం జరిగింది.3. కొర్ర పొలంబడి ద్వారా ఇలా 14 వారాలు క్లాసులు తీసుకొని ర రైతులకు మంచి వ్యవసాయ పద్ధతి పొలంబడి ద్వారా పంటలను ఎలా దిగుబడి తీసుకోవాలి రైతులకు తెలియజేయడం జరిగింది.