పంటల దిగుబడి రాక, అప్పులబారం పెరిగిపోయి పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య
,
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-బంటనహల్లో ఘటన,కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు *ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి వ్యవసాయమనే జూదంలో ప్రతిఏటా ఆశల సేద్యంలో ఆ రైతన్న ఓడిపోయాడు.ఒకవైపు పంటలు దిగబడి రాక,మరొకవైపు విధి ఆడుతున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయి అప్పుల భారం( కౌలు) ఏడాదికేడాది పెరిగిపోతుoడడం ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. చివరకు జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్యకు పాల్పబడిన విషాదకర ఘటన బంటనహళ్ గ్రామంలో గత రాత్రి చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని బంటనహళ్ గ్రామానికి చెందిన సుంకన్న కు ముగ్గురు కుమారులు సంతానం.వీరిలో నాగరాజు(36)అనే యువరైతు తనకున్న 2 ఎకరాలతో పాటు మరో 14 ఎకరాలను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు.గతేడాది 14 ఎకరాల్లోనూ,మరోసారి 10 ఎకరాలల్లోనూ,ఈ ఏడాది 4ఎకరాల్లోను మిరప పంటను సాగు చేశారు. అయితే అంత దిగుబడి ఆశించనంత రాకపోగా కనీసం పెట్టబడును కూడా రాకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.అంతేకాక ఈ ఏడాది మిరప పంట సాగు చేయగా వర్షం కారణంగా మొత్తం మిరప పంట మొలక దశలోనే కుళ్లిపోయింది.దీంతో మరొక్కసారి కుళ్ళిపోయిన ఆ పంటను తొలగించి మరల నూతన పంటను సాగు చేశారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు వరసగా మూడేళ్లుగా పంటల దిగుబడి రాక,మరోవైపు అప్పుల భారం పెరిగిపోతుండడంతో నాగరాజు లోలోపల మదనపడుతూ కాలం వెలదీస్తున్నారు.శనివారం సాయంత్రం తాను కౌలుకు సాగుచేసిన పొలానికి వెళ్లి వస్తానని చెప్పి ఆ పొలం వద్దే పంటలకు పిచికారి చేసే పురుగుల మoదును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రాత్రి ఎంత సేపు అయినప్పటికీ నాగరాజు ఇంటికి రాకపో,ఇంటికి రాకపోవడంతో పలుచోట్ల కుటుంబ సభ్యులు వెతికారు. అయితే ఏరూరు గ్రామ సమీపంలో తాను సాగుచేసిన పంట పొలం వద్ద అప్పటికే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయిన నాగరాజును చూసి పరిశీలించి చూడగా అప్పటికే నాగరాజు మృత్యువాత పడడం చూసి బోరున విలపించారు.మృతుడు నాగరాజుకు దాదాపు రూ.20 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లుగా గ్రామస్తులు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.మృతునికి భార్య లక్ష్మి,ఓ కుమార్తె ఉన్నారు.మృతుడు నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదు కోవాలని గ్రామ రైతులు,గ్రామస్తులు కోరుతున్నారు.